సమంతను ఇదివరకటిలా టాలీవుడ్ ఆదరిస్తుందా? కోలీవుడ్‌కు తరలిపోతుందా?
on Oct 4, 2021
రకరకాల స్పెక్యులేషన్స్ తర్వాత ఎట్టకేలకు తాము భార్యాభర్తలుగా విడిపోతున్నామనీ, స్నేహితులుగా కొనసాగుతామనీ సమంత, నాగచైతన్య ప్రకటించడంతో సినీ వర్గాలవారు, అభిమానులు మొదట షాకైపోయి, తర్వాత కొంతకాలంగా వింటూ వస్తున్నదేగా అని సర్దుకున్నారు. ఇక ఇప్పుడు సామ్, చైతూ ఎవరి జీవితాలను వారు స్వతంత్రంగా, స్వేచ్ఛగా జీవించనున్నారు. అయితే ఇప్పుడు చాలామందిలో మెదులుతున్న ప్రశ్నలు.. మునుపటిలా తెలుగుచిత్రసీమ సమంతను ఆదరిస్తుందా? ఆమెకు మంచి మంచి అవకాశాలను అందిస్తుందా? అని.
నాగచైతన్యను వివాహం చేసుకోక ముందు కంటే, చేసుకున్న తర్వాతనే సమంత మరింత స్వేచ్ఛగా తన కెరీర్‌ను కొనసాగిస్తూ వచ్చిందనేది నిజం. ఒకవైపు పర్ఫార్మెన్స్కు ఎక్కువ స్కోప్ ఉన్న సినిమాలు చేస్తూనే, సోషల్ మీడియాలో బోల్డ్ ఫొటోలు, వీడియోలతో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంటూ వచ్చింది. 'ఓ బేబి', 'మజిలీ' లాంటి సినిమాలు ఆమెకు నటిగా మరింత పేరు తెచ్చాయి. అయితే 'ద ఫ్యామిలీమ్యాన్ 2' సిరీస్‌లో ఆమె చేసిన రాజీ క్యారెక్టర్ విమర్శకుల్ని మెప్పిస్తే, అక్కినేని ఫ్యామిలీ అభిమానుల్ని డిజప్పాయింట్ చేసింది. అలాంటి బోల్డ్ క్యారెక్టర్ చేయడం ఇప్పుడు అవసరమా అంటూ సోషల్ మీడియా ద్వారా ట్రోల్ చేశారు.
అయితే దానికి మంచి ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత షేర్ చేసిన క్లీవేజ్ ఫొటోలు, బికినీ ఫొటోలు, అర్ధనగ్న ఫొటోలు అక్కినేని ఫ్యామిలీని, వారి అభిమానుల్నీ బాగా ఇబ్బందిపెడుతూ వచ్చాయంటారు. నాగచైతన్య ఆమె స్వేచ్ఛకు అడ్డురాకపోయినా, అభిమానుల నుంచీ, కుటుంబం నుంచీ వచ్చిన ఒత్తిడులతో అతను కూడా క్రమంగా ఆమెకు ఆంక్షలు పెడుతూ వచ్చాడంటారు. దాంతో ఇద్దరూ విడిపోక తప్పలేదు.
ఇలాంటి నేపథ్యంలో సమంత కెరీర్ ఎలా ఉండనున్నదనే చర్చ ఇండస్ట్రీలో నడుస్తోంది. గుణశేఖర్ మూవీ 'శాకుంతలం'ను ఆమె ఇటీవల పూర్తిచేసింది. పౌరాణిక చిత్రంగా రూపొందుతోన్న 'శాకుంతలం'లో ఆమె శకుంతల పాత్రను పోషించింది. ఇది తప్పితే తెలుగులో ఆమెకు మరో సినిమా లేదు. తమిళంలో నయనతార, విజయ్ సేతుపతి కాంబినేషన్లో 'కాదు వాకుల రెండు కాదల్' మూవీని చేస్తోంది. అక్కినేని వారి కోడలిగా ఆమెకు వచ్చిన ఇమేజ్‌తో పర్ఫార్మెన్స్కు బాగా స్కోప్ ఉన్న క్యారెక్టర్స్, లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ ఆమె దగ్గరకు వచ్చేవి. వాటిలో తనకు నచ్చిన వాటిని ఎంచుకునేది సమంత. ఇప్పుడు చైతూతో విడిపోయాక మునుపటిలా ఆమెకు డైరెక్టర్స్ అవకాశాలు ఇస్తారా? అనే సందేహాన్ని ఇండస్ట్రీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
సమంత మాతృభాష మలయాళం. చెన్నైలో పుట్టిపెరిగిన ఆమెకు అటు మలయాళం, ఇటు తమిళ చిత్రరంగాల కంటే మిన్నగా తెలుగు చిత్రరంగం బాగా ఆదరించి, స్టార్ హీరోయిన్ను చేసింది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటిస్తూ, తనకు అన్నీ ఇచ్చిన హైదరాబాద్‌లోనే ఉంటాననీ, ఇంకెక్కడికీ వెళ్లనని సమంత చెప్పింది. టాలీవుడ్ నుంచి సరైన అవకాశాలు రాకపోతే, సమంత ఏం చేస్తుంది? తమిళంలో అవకాశాలను వెతుక్కుంటుందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరి కొద్ది నెలల తర్వాత ఈ ప్రశ్నలకు సమాధానం లభించవచ్చు.
Also Read